సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఓం.. శివోహం.. రేపటి నుండి పరమశివునికి ఇష్టమైన మాసంగా పేరొందిన కార్తీకమాసం రేపటి నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న స్కంద పురాణంలో పేర్కొన్న 5 పంచారామాలు ను భక్తులు దర్శించుకొంటారు. వీటిలో అతి విశిష్టమైనది భీమవరం గునుపూడిలో సాక్షాతూ చంద్రుడు ప్రతిష్టించాడని పురాణాలూ పేర్కొన్న శ్రీ సోమేశ్వరుని పంచారామ ఆలయం. ఇక్కడ ప్రపంచం లో ఎక్కడ లేని విధంగా చంద్రునివలె అమావాస్యకు గోధుమవర్ణం ,పౌర్ణమికి స్వచ్ఛమైన తెలుపులో శివలింగం రంగులు మారుతూ ఉంటుంది. ఇదో శివలీల అద్భుతంగా చెప్పుకొంటారు. అందుకే ఈ మాసంలో ఎంతో దూరప్రాంతాల నుండి తరలి వచ్చే వేలాది భక్తులకు దేవాదాయ శాఖ మరియు ధర్మ కర్తల మండలి సభ్యులు, దాతలు, స్వచ్చంధ సంస్థలు భక్తులు సహకారంతో ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యనిర్వహణ అధికారి, డీ. రామకృష్ణ రాజు మన సిగ్మా న్యూస్ కు తెలిపారు. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యాలు, ప్రసాదం వితరణలు, నిత్యాన్నదానాలు తో పాటు భక్తులకు వేగంగా స్వామి దర్శనం కావడానికి బాలికేట్స్, బాల్కనీ మెట్ల మార్గం కూడా నిర్మించారు. సర్వదర్శనం మరియు టికెట్ దర్శనాలు కు వేరు వేరే లైన్ లు ఉంటాయి.మహిళలు చంద్ర పుష్కరిణి వద్ద దీపారాధనలు చేసుకోవచ్చు.. తెల్లవారు జాము 4 గంటల నుండి రాత్రి 9న్నర గంటలవరకు స్వామివారి దర్శనం ఉంటుంది
