సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటేలా రంగురంగుల కాంతులతో గత రాత్రి వైభవంగా పండుగ జరిగింది. గత రాత్రి 7గంటల కల్లా ఇంటింటా పుష్ప విద్యుత్ దీప అలంకారాలతో, శ్రీ లక్ష్మి పూజలు తో పాటు అందమైన దీపపు వెలుగులు కొలువు దీరాయి. పెద్దలు చిన్నారుల కోలాహలంతో..మార్వాడీలు, బెంగాలీలు ఇళ్ళు లక్ష్మి కళతో మిఠాయిల పంపిణీలతో మరింత సందడిగ ఉన్నాయి. ఇక బాణాసంచా కాల్పులు తో ఆకాశం రంగు రంగుల కాంతుల అలంకారాలతో ప్రత్యక శోభ తో కనపడింది. ఆర్థికంగా బలమైన వర్గాలు ఉన్న ప్రాంతం కాబ్బటి రాత్రి 10 గంటల వరకు తగ్గేదే లే.. అన్న రీతిలో వేడుకలు నిర్వహించారు. దీపావళి ముందు 2 రోజులు వర్షాలు పడకపోవడంతో ఏవో కొన్ని నాసిరకం, నీళ్ల సామాగ్రి తప్ప బ్రాండెడ్ బాణాసంచా సామాగ్రి బాగా కాలటం తో అందరు వినోదించారు. పట్టణంలోని పలు దేవాలయాలు తో పాటు గత సాయంత్రం, శ్రీ స్వర్ణ సాయి మందిర్, మారుతి సెంటర్ లోని శ్రీ బాబావారి మందిరాలలో దీపాలతో ప్రత్యేక అలంకరణలు చేసారు. పట్టణంలో ఎక్కడ ప్రమాదాలు లేకుండా ప్రశాంతగా వేడుక జరగటం విశేషం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *