సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం లో పెద్దాయన గ్రంధి వెంకటేశ్వర రావు పవిత్ర ఆత్మకు సద్గతి కలగాలని నేడు, గురువారం ఆయన నివాసం వద్ద కుమారులు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, బాలాజీ, చల్లారావులు, వేద పండితుల మంత్రాల మధ్య పితృ కర్మలు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమానికి కరోనా నిబంధనలు పాటిస్తూ పలువురు ప్రముఖులు వచ్చి పాల్గొనడం జరిగింది. ( పైన తాజా చిత్రం)ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తన తండ్రిని ఉద్దేశించి నేడు, గురువారం సోషల్ మీడియాలో ఇచ్చిన పోస్ట్ వైరల్ అవుతుంది. జి వి ఆర్ తో పరిచయం ఉన్న ప్రతి మనిషిని కదిలిస్తుంది. ఆ పోస్టులో.. నాన్నా.. మీరు కల్మషమెరుగని మనస్సుతో.. అందరినీ ఆప్యాయంగా పలకరించే మంచి మనిషిగా.. ఒక రైతుగా వాణిజ్య,రాజకీయ రంగాలలో మీది వారసత్వం లేని నాయకత్వం.. దాతగా దాతృత్వంలో కుడా మీకు మీరే సాటి..జనరల్ మర్చంట్స్,లయన్స్ క్లబ్, చాంబర్ ఆఫ్ కామర్స్, అర్బన్ బ్యాంక్ ఆధ్యక్షులుగా,మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ, వై.యస్.ఆర్ పార్టీ నాయకులుగా మీ సేవలతో భీమవరం ప్రజలలో చెరగని ముద్ర వేసిన మీరు మీ నాయకత్వం మాకు వారసత్వం..మీరే నాన్నా మాకు ఆదర్శం మీరు చూపిన బాటలోనే పయనిస్తాం.మీ జ్ఞాపకాలతో మిమ్ము నిత్యం స్మరిస్తూ. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తూ..అశ్రునయనలతో….
