సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం వైఎస్ జగన్ నేడు, శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసాయం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారంభించడంతోపాటు అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం జరిగిందని పేర్కొంటూ.. లంక భూములకు పట్టాలు అందజేశారు. లంక భూమి సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు కల్పించాం. గ్రామ ఇనామ్ సర్వీస్ భూములను నిషేధిత జాబితా నుం చి తొలగించాం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములకూ హక్కులు కల్పిస్తున్నాం . రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నాం . తాము అధికారంలోకి వచ్చాక 2 లక్షల 7 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ , ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. బాబు సీఎం గా ఉన్నప్పుడు అంతా దోపిడినే జరిగిందని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదని అన్నారు. తొలిసారి వెన్ను పోటుతో, రెండోసారి కార్గిల్ యుద్ధం.. పుణ్యాన, మూడోసారి దత్త పుత్రుడుతో కలసి రైతులకు రుణమాఫీ అంటూ మాయమాటలతో అధికారంలోకి వచ్చా రని విమర్శించారు. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ మరోసారి తోడేళ్లంతా ఏకమవుతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు.తాను నమ్మిన జనబలంతో సింహలా సింగిల్ గా వస్తానన్నారు.
