సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నాగులచవితి పర్వదినం నేపథ్యంలో నేడు,శుక్రవారం భీమవరంలోని అన్ని సుబ్రమణ్య స్వామి దేవాలయాలు, ప్రముఖ దేవాలయంలోని ఉప నాగేంద్ర ఆలయాలు భక్తులతో భారీ క్యూ లైన్ లతో కిటకిటలాడాయి. విష్ణు కాలేజీ రోడ్డులోని , నరసయ్య ఆగ్రహం , ఉండి రోడ్డులోని పలు పాము పుట్టలు వద్ద మహిళలు విశేషంగా పూజలు నిర్వహించారు. శ్రీ రాంపురం లోని శ్రీ రామలింగేశ్వర దేవాలయం ( ఫై ఫోటో ) గునుపూడి పంచా రామంలో అయితే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. కార్తీక దీపారాధనలతో ఆలయ పరిసర ప్రాంతాలు తెల్లవారు జామునుండి వెలుగులతో నిండిపోయాయి.నాగుల చవితి శ్రీ నాగేంద్ర స్వామికి మహిళలు నువ్వుల ఉండలు, చలివిడి, ఆవు పాలు, తెగలు, నీటిలో నానిన పెసరపప్పు భక్తి శ్రద్దలతో సమర్పించారు. దేవాలయ ఆవరణాలలో కార్తీక దీపారాధన శోభా కనిపించింది. మహిళలు తమ కుటుంబ ఆరోగ్యం, వంశ అభివృద్ధి , శ్రేయస్సు కోరుకొంటూ పూజలు చేసారు. కృష్ణ జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుండి వేలాది భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. నాగుల చవితి సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలు అన్నింటినీ ఆలయ సిబ్బంది రద్దు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *