సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో నేడు, సోమవారం రెగ్యులర్ బెయిల్ లభించింది. ఈనెల 29 నుంచి బెయిల్‌కు అంతకుముందు ఉన్న షరతులన్నింటినీ తొలగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈనెల 28లోపు చంద్రబాబు హెల్త్ రిపోర్టును విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జికి సమర్పించాలని ఆదేశించింది. ఈనెల 29 నుంచి చంద్రబాబు రాజకీయ ర్యాలీల్లో నేరుగా పాల్గొనవచ్చని ప్రకటించింది. అయితే ఈనెల 30వ తేదీన చంద్రబాబు ఏసీబీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.అటు.. చంద్రబాబు బయట ఉంటె సాక్షులను ప్రభావితం చేస్తారన్న వాదనతో గాని , ఇటు.. రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా కేసు పెట్టిందన్న వాదనతో కానీ హైకోర్టు ఏకీభవించలేదు. దీంతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు కు ,మంచి జోష్ వచ్చింది. మరోవైపు ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబుకు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ సస్పెండ్ చేయాలని, FIR క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా గతంలోనే వాదనలు పూర్తయ్యాయి. గత నెలలో తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఒకటి రెండు రోజులలో సుప్రీం ధర్మాసనం తీర్పు ప్రకటించే అవకాశం ఉంది.
