సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీకమాసోత్సవములలో భాగంగా నేటి సోమవారం కార్తీకమాసం లో మొదటిది కావడంతో నేటి తెల్లవారు జాము 3గంటల నుండి భక్తులు పోటెత్తారు. ధర్మకర్తమండలి సభ్యులు, స్థానిక శివ భక్తులు స్వచ్చందంగా భారీ క్యూ లైన్ల లో ఉన్న భక్తులకు దర్సనానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పర్యవేక్షించారు.నేటి రాత్రివరకు ఒక్క రోజులో సుమారు 50వేల మంది పైగా భక్తులు స్వామివారిని దర్శించుకొనే అవకాశం ఉంది, 7 రోజు అయిన ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు భక్తులు సర్వదర్శనాలతో పాటు ప్రత్యక దర్శనముల టికెట్స్ విక్రయం ద్వారా రూ.5,98,150/- రూ . పూజా అర్చనలు రుసుముల ద్వారా రూ.22,116/లు, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.25,170/_లు మొత్తం రూ.6,45,436/లు ఆధాయం లభించింది అని దేవాలయ ఇఓ డి రామకృష్ణ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *