సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు కు హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. న్యాయస్థానం తీర్పుపై ఏపీ సర్కార్ సుప్రీం కోర్టు కు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. నేడు, మంగళవారం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. చంద్రబాబు కు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ హైకోర్టు తన పరిధులు అతిక్రమించినట్లు గతంలో సుప్రీం కోర్ట్ ఇచ్చిన మార్గదర్శకాలు అతిక్రమించినట్లు ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు పిటిషన్ వెయ్యనుంది . ఇంకా కేసు విచారణలో ఉండగా హైకోర్టు బెయిల్ ఇస్తూ దర్యాప్తు కు సంబంధించి లోపాలపై చేసిన వ్యాఖ్యలు ఫై సీఐడీ తన అభ్యన్తరం చెప్పింది. ఇదే కేసులో సుప్రీం కోర్ట్ చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ఫై తీర్పు కూడా రిజర్వ్ చేసి మరో కొద్దీ రోజులలో తీర్పు బహిరంగ పరచనున్న విషయం తెలిసినప్పటికీ హైకోర్టు ముందే చంద్రబాబు కు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ.. సీఐడీ ఫై చేసిన వ్యాఖ్యలు సుప్రీం కోర్టు దృష్టికి ఏపీ ప్రభుత్వం తెచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *