సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు, గురువారం మధ్యాహ్నం భీమవరంలోని, గ్రంధి వెంకటేశ్వర రావు ఇంటివద్ద ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆయన సోదరులు బాలాజీ, చల్లా రావు ల ఆధ్వర్యంలో వారి తండ్రి జి వి ఆర్ పితృ కర్మలను కొవిడ్ నిబంధనలను అనుసరించి సంప్రదాయబద్ధంగా జరిపారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. రాజకీయాల్లో జి.వి.ఆర్ నుండి తాను ఎంతో నేర్చుకున్నానని అన్నారు .గ్రంధి వెంకటేశ్వరరావు ప్రజల మనిషి ,భీమవరం రాజకీయాలను శాసించిన మున్సిపల్ మాజీ చైర్మన్ గ్రంధి వెంకటేశ్వరరావు (జి.వి.ఆర్) సేవలు మరువలేనివి అన్నారు.ఇంకా రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు హాజరుఅయ్యారు. జిల్లా పరిషత్ చైర్మన్ కౌరు శ్రీనివాసు, పాలకొల్లు శాసనసభ్యులు డాక్టరు నిమ్మల. రామానాయుడు, ఉండి శాసనసభ్యులు మంతెన రామరాజు, నరసాపురం మున్సిపల్ చైర్మన్ శ్రీమతి బర్రి.శ్రీ వెంకటరమణ, మెంటే పార్ధ సారధి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల. తాతాజీ లతో పాటుగా ఇతర ప్రజా ప్రతినిధులు ,పలు ప్రముఖుల, తది తరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *