సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు కీలక నిందితుడుగా ఉన్న ఏపీ పైబర్ నెట్ కుంభకోణం కేసులో సంబంధం ఉన్న చంద్రబాబు సన్నిహితులుగా భావిస్తున్న వారి ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు ఏపీ సీఐడీ నవంబర్ 8వ తేదీన అనుమతి కోరటంతో ఏసీబీ కోర్ట్ తాజగా నేడు, మంగళవారం అనుమతించింది. దీనితో ఏపీ పైబెర్ నెట్ కేసులో టెరా సాప్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్‌తోపాటు, కనుమూరి కోటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు 7 ప్రాంతాల్లో ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ ఆస్తుల వివరాల ప్రకారం హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరులో ఉన్న వారి కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తులను ప్రభుత్వానికి ఎటాచ్‌మెంట్‌కు సీఐడీ అధికారులు కున్న అడ్డంకి తొలగింది.
