సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ నెల 26న సాయంత్రం ప్రధాని మోదీ తిరుమలకు రానున్నారు. తిరుమల శ్రీవారి దర్శ నానికి ఆయన రానున్నారు. ఈ నెల 27న ఉదయం ప్రధాని మోడీ శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ మేరకు తిరుపతి జిల్లా పోలీస్ అధికారులకు సమాచారం రావడంతో కొండపై గట్టి బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం తిరుమలలో పోలీస్అధికారులు అదే పనిలో నిమగ్నమయ్యారు. ప్రధాని బస చేసే గెస్ట్‌హౌస్, చేపట్టాల్సిన భద్రతా చర్యలపై పోలీస్ అధికారులు దృష్టి సారించారు. ప్రధాని తిరుమల పర్యటనకు వస్తున్ననేపథ్యంలో సీఎం జగన్ కూడా 26వ తేదీన తిరుపతి వచ్చే అవకాశాలు ఆ రాత్రి ప్రధాని మోడీ గౌరవార్ధం సీఎం జగన్ ఆయనతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
