సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ ఎన్నికల ఓటింగ్ తేదికి ఇంకా వారం రోజులు సమయం ఉంది. అధికార బిఆర్ ఏస్ ఫై కాంగ్రెస్ పార్టీ దూకుడు మాములుగా లేదు.. నేడు, బుధవారం, దర్పల్లిలో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…‘‘డిసెంబర్ 3వ తేదీన లెక్క చూసుకో కేసీఆర్.. 80 కంటే ఒక్కటి తక్కువున్నా ఏ చర్యకైనా సిద్ధం. కేసీఆర్‌కు పదేళ్లు అవకాశం ఇచ్చారు. అంతా అవినీతి మయం .. వాళ్ళ కుటుంబసభ్యులు తప్ప అక్కడ అభివృద్ధి లేదు.. ఇక్కడ పోడు భూముల సమస్య తీరలేదు. గిరిజనులను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరుస్తానని పదేళ్లయినా తెరువలేదు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇక్కడి రైతులు ఓడించారు. ఈ ప్రాంత రైతుల సమస్యలను బీఆర్ఎస్ నేతలు పట్టించుకోలేదు. బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ కార్మికులను నిర్లక్ష్యం చేసి వారి హక్కులను కాలరాశారు. గుండోడు ఎక్కడికో పోయిండు.‘ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరు గెలుస్తారో రాష్ట్ర ప్రభుత్వం అదే వస్తుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోళ్ల రాజ్యం. బీఆర్ఎస్ అంటే దొరల రాజ్యం, దొంగల రాజ్యం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని కేసీఆర్ పేదలను ఊహాలోకంలో ఉంచారు. ఆయన మాత్రం 150 రూముల బంగ్లా కట్టుకున్నాడు. డిసెంబర్ 3వ తేదీ ఎన్నికల కౌంటింగ్ తర్వాత ఏమైతదో చూడు కేసీఆర్’’ అని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.
