సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖపట్నం రాజధానిగా అక్కడ నుండి పాలన మొదలుపెట్టే యోచనలో ఉన్న జగన్ సర్కార్ శరవేగంగా ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. తాజగా నేడు, గురువారం ఉత్తరాంధ్ర ప్రగతి కోసం..విశాఖలో అధికారుల వసతి ఏర్పాట్లు, గుర్తింపుపై మరో జీవోను ఏపీ ప్రభుత్వం కార్యదర్శిగా జవహర్ రెడ్డి విడుదల చేసారు. విశాఖలో మిలీనియం టవర్లు ఏ, బీ లో సీనియర్ అధికారులు, ఎమ్మెల్యేలకు ఇతర ప్రజా ప్రతినిధులకు వసతి సౌకర్యాలకు గదులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ద్వారా మిలీనియం టవర్స్‌లోని ఏ, బీ బ్లాకులల్లోని లక్షా 75వేల 516 చదరపు అడుగులను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశించింది. మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులకు ఆయా శాఖల భవనాలకు చెందిన 2 లక్షల 27వేల 287 చదరపు అడుగుల స్ధలాన్ని వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో తెలిపింది. ఇప్పటి వరకూ 16శాఖలకు సంబంధించి వసతిని గుర్తించినట్టు జీవోలో వివరాలను తెలిపింది. ఇంకా , సాంఘిక సంక్షేమం, ఆర్టీజీలకు కూడా ఇంకా వసతి ఏర్పాట్లు పరిశీలనలో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *