సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమండ్రి బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి యువకుడు గల్లంతయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన శెట్టి వినోద్ కుమార్ అనే యువకుడు నేడు, శుక్రవారం ఉదయం బైక్ పై రాజమండ్రి బ్రిడ్జి వద్దకు చేరుకుని, అందరు చూస్తుండగా బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకేసాడు. దానితో హతాశయులు అయిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నేటి సాయంత్రం వరకు శెట్టి వినోద్ కుమార్ ఆచూకీ జాడలేదు. యువకుడు ఆత్మహత్యా యత్నానికి ఎందుకు ఒడిగట్టాడో ? తెలియాల్సి ఉంది. కాగా బైక్ లో యువకుడి ఆధార్ కార్డు ఉంచడంతో లభించాయి. పోలీసులు యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
