సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీమిండియా కప్ అందుకోవాలని అందరు టీవీలకు అత్తుకుపోయిన నేపథ్యంలో రాత్రి 11న్నర సమయంలో విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఊహించని రీతిలో మంటలు చెలరేగి క్షణాల్లో బోట్లు కాలి బూడిదయ్యాయి. ఇంత భారీ అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్ టీమ్..47కు ఫైగా సీసీ కెమెరాలు ఫుటేజ్ ఆధారముగా దర్యాప్తు పూర్తిచేసి ప్రమాదానికి గల కారణాలను నేడు, శనివారం మీడియాకు సీపీ రవి శంకర్ అయ్యన్నర్ వెల్లడించారు. అయన మాటలలో..‘ నిందితులు వాసుపల్లి నాని, అతని మామ సత్యమే ఈ అగ్నిప్రమాదానికి అసలు కారణం. 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు వీరిద్దరూ మద్యం తాగడానికి హార్బర్‌కు వచ్చారు. అల్లిపల్లి వేంకటేశ్‌కు చెందిన 887 నెంబర్ బోటులో మద్యం తాగి ఫిష్ ప్రై చేసుకోని పార్టీ చేసుకున్నారు. అనంతరం సిగరేట్ తాగి పక్కనే ఉన్న 815 నెంబర్ బోటుపై పడేశారు. దీంతో మెల్లమెల్లగా మంటలు చెలరేగి బాగా వ్యాపించాయి. మంటలు వ్యాపించడం గమనించి మెల్లగా అక్కడి నుంచి నిందితులు జారుకున్నారు. వాసుపల్లి నాని అక్కడ బోట్లలో కుక్‌గా, సత్యం వాచ్‌మెన్‌గా పనిచేస్తుంటారు. వారి ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 437, 438, 285, ప్రకారం కేసు నమోదు చేశాం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా చాలా మంది అనుమానితులను విచారించాం. విచారించిన అనుమానితుల్లో ముగ్గురు నానిలు ఉన్నారు. విచారణలో భాగంగా యూట్యూబర్ నానిని తీసుకొచ్చి విచారణ చేశాం. నిజానికి విచారణలో అతని ప్రమేయం లేదంటే.. మేము ప్రోసిజర్ ప్రకారం విడిచి పెట్టే వాళ్లం. కానీ ఈ లోపే హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశాం’’ అని సీపీ రవి శంకర్ అయ్యన్నర్ తెలిపారు.ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధం కాగా.. 18 బోట్లు పాక్షికంగా డామేజ్ అయ్యాయి. సుమారు రూ.8 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. జగన్ సర్కార్ ఇప్పటికే నష్టపరిహారం లో 80 శాతం చెల్లించడానికి ముందుకు వచ్చి చెల్లించడం గమనార్హం.. జనసేన అధినేత పవన్ బాధితులను పరామర్శించి వారి కుటుంబాలకు 50వేల రూ . చప్పున అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *