సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని నరేంద్ర మోదీకి ఆదివారం రాత్రి రేణిగుంటలోని విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. హైదరాబాదు నుంచీ రాత్రి 7 గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ రాగా ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వగతం పలికారు. ఈ కార్యక్రమంలో, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ కరుణాకర రెడ్డి, ఎంపీలు మిధున్‌రెడ్డి, గురుమూర్తి, రెడ్డెప్ప, జీవీఎల్ నరసింహారావు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి,మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి,సీఎం రమేష్,సుజనా చౌదరి, తదితరులు పాల్గొన్నారు. విమానాశ్రయంలో సీఎం జగన్ తో కొద్దిసేపు ముచ్చటించిన అనంతరం ప్రధాని మోదీ 7.30 గంటలకు తిరుమల బయల్దేరారు. తిరుమలలో గత రాత్రి రచన అతిథిగృహం కి చేరుకొన్న ప్రధాని మోడీ నేటి సోమవారం ఉదయం కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుని ఆలయ మర్యాదలతో దర్శించుకొన్నారు. మోడీ ప్రధానిగా సుమారు గత 10ఏళ్లలో ఇది నాలుగోసారి శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.
