సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కరోనా లాక్ డౌన్ లతో, ఓటిటి ప్రదర్శనలతో కిక్ మిస్ అయిపోతున్న సినిమా థియేటర్స్ తెలుగు సినీ పరిశ్రమకు సినిమా థియేటర్స్ లో విడుదలయ్యి అఖండ విజయాన్ని మూటగట్టుకొని ఏపీలో తగ్గింపు టికెట్స్ ధరలలో సైతం సినిమాకు వరంలాగా మారి రిపీట్ ప్రేక్షకులు చూడటంతో సీనియర్ హీరో బాలకృష్ణ తమ అఖండ సినిమా ప్రస్తుత సీజన్ లో 200 కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన సినిమా రికార్డు ప్రకటించారు. గత గురువారం రాత్రి హైదరాబాద్లోని ఆర్‌టీసీ క్రాస్ రోడ్‌లో గల సుదర్శన్ 35.ఎం.ఎం. థియేటర్‌లో అర్థ శతదినోత్సవ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… ‘ఇది ప్రేక్షకులు ఇచ్చిన విజయం. మా టీమ్ సమష్టి కృషి. శివుడు భక్తుడిగా నేను చేసిన అఖండలోని పాత్ర నాన్నగారు చేసిన పాత్రలు గుర్తుచేసుంటూ వాటిని పోషించాను. ‘మానవ పుట్టుకలో ఒకరో ఇద్దిరినో స్నేహితులుగా ఇస్తారు. కానీ మాకు కోట్లాది మంది అభిమానులను సంపాదించేలా భగవంతుడు చేశాడు. కోవిడ్ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారోరారో అనుకున్న సమయంలో తీర్థయాత్రలకు వచ్చినట్లు థియేటర్లకు జనాలు వచ్చి ‘అఖండ’ సినిమా వీక్షిస్తున్నారు. ఈ అఖండ విజయం తెలుగు చలన చిత్ర పరిశ్రమ విజయం’అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ,. ‘నిజాయితీగా చెబుతున్నా… ఇలా అఖండ సినిమా విడుదల అవుతుందనీ, యాభై రోజులు అడుతుందనీ, ఇంకా థియేటర్లలో కొనసాగుతుందనీ కానీ నేను కానీ, ఎవరూ కానీ కల కనలేదు. ఆ కలను నిజంచేసిన ప్రతి ఒక్కరినీ ధన్యవాదాలు’అన్నారు
