సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక DNR విద్యాసంస్థల క్యాంపస్ లో నివా బుపా కంపెనీ కాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను నిర్వహించిన ప్లేసెమెంట్ డ్రైవ్ లో 300మంది ఎం.బి.ఎ విద్యార్థులు ఎంపిక అయినట్లు కళాశాల సెక్రటరీ , గాదిరాజు సత్యానారాయణ రాజు బాబు గారు తెలిపారు. మాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ గా మార్చారు అని అత్యంత విశ్వసనీయమైన స్వతంత్ర ఆరోగ్య బీమా భాగస్వాములలో ఒకటి మంచి మార్కెట్ కల్గిన సంస్థ అని అన్నారు. వారి ఇంటర్వ్యూలో విజయం సాధించిన తమ కాలేజీకి చెందిన 30 మంది విద్యార్థులకు అభినందనలు తెలిపారు. తమ DNR విద్యాసంస్థలలోచాలా కంపెనీ లు ఉద్యోగం తో పాటు ఉన్నత విద్యావకాశాలు అందిస్తున్నాయని కావున విద్యార్థులు తమకు అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. అంజన్ కుమార్ మరియు ప్లేసెమెంట్ డైరెక్టర్ డా. సిహెచ్.రాంకిషోర్ మాట్లాడుతూ ఇప్పటివరకు తమ కళాశాలలో ఈ విద్య సంవత్సరంలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సుమారు మూడు వందలకు పైగా ఉద్యోగాలు కల్పించామని మరియు మిగిలిన విద్యార్థులందరికీ రానున్న ప్రముఖ కంపెనీలలో ప్రాంగణ నియమాకాలలో ఉద్యోగాలు కల్పిస్తామని తెలియచేసారు.
