సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం నేడు, శుక్రవారం మధ్యాహ్నం ముగిసింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమపై రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీపై అవలంభిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా ఉద్యమ బలోపేతానికి పలు కీలక నిర్ణయాలుతీసుకొన్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. నేడు, శుక్రవారం ఏపీ సీఎస్‌ను కలిసి పాత జీతాలే ఇవ్వాలని కోరనున్నాయి. ఈ నెల 23వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి. 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నాయి.ఈ నెల 27 నుంచి 30 వరకూ నాలుగు రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహారదీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ, ఫిబ్రవరి 7 లేదా 8 నుంచి ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధం కావాలని నిర్ణయించాయి.
