సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 2.0 విధానంలో అప్పుడప్పుడు కొన్ని సాంకేతిక సమస్యలు వస్తుండటంతో రిజిస్ట్రేషన్ అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత శుక్రవారం పలు కేంద్రాలలో నిన్న మధ్యాహ్నం నుండి రిజిస్ర్టేషన్లు నిలచిపోయాయి. ఆచంట,ఆకివీడు సబ్–రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈకేవైసీ, సర్వర్లు పనిచేయక రిజిస్ట్రేషన్లు నిలిచాయి. అలాగే ఏలూరు జిల్లాలోని కార్యాల యాల్లోనూ ఇదే పరిస్థితి వెంటాడింది. ఆధార్‌తో ఈకెవైసీ చేయడానికి ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లోనూ కొంచెం అటుఇటుగా ఈకెవైసీ సమస్య వెంటాడింది. పలుచోట్ల సాయంత్రం ఆరు గంటల వరకు రిజిస్ర్టేషన్లు నిలచిపోయాయి. తర్వాత సాంకేతిక ఇబ్బందులు తొలగిపోయాయి. దాంతో రిజిస్ట్రేషన్లకు వచ్చిసుదీర్ఘంగా నిరీక్షిస్తున్నవారు ఇబ్బంది పడకూడదని రాత్రి కూడా రిజిస్ర్టేషన్ ప్రక్రియ కొనసాగించారు. జిల్లాలో భీమవరం, సజ్జాపురం, తాడేపల్లిగూడెం, తణుకులో అత్యధికంగా రిజిస్ర్టేషన్లు నమోదుకావడం గమనార్హం..
