సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: దశాబ్దాల క్రితం భీమవరం ఒకటవ పట్టణంలో వ్యాపార ప్రముఖులు వ్యవస్థీకరించిన ది. కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ భవన నిర్మాణం సంపూర్ణంగా పూర్తి అయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని ఈ నెల 23 వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకు, పెద్దలు, ప్రజా ప్రతినిధులు, వ్యాపార ప్రముఖులు, కార్యవర్గ సభ్యులు,అందరూ సమతుల్యంతో ప్రారంభిస్తున్నామని నిర్వాహక కమిటీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కిరానా మర్చంట్ హాల్ లో, భవన నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ సమీక్ష సమావేశం నిర్వహించారు.అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అయిత వెంకట కృష్ణారావు, అద్దంకి శివ ప్రసాదులు మాట్లాడుతూ మా అసోసియేషన్ కళ్యాణ మండపం అన్ని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించామని, మధ్యతరగతి వారికి అనుకూలంగా ఉంటుందని, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు మరియు , శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ లు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేయాలని కోరారు.ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.
