సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: స్వర్గీయ గ్రంధి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుమారులు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సోదరులు స్థానిక హౌసింగ్ బోర్డ్ లో ఉన్నటువంటి శ్రీ పద్మావతి వెంకటేశ్వరస్వామి ఆలయంలో మరియు స్థానిక సెంటీమీరీస్ చర్చిలో సుమారు 125 మంది పేదలకు విలువైన శీతాకాల రగ్గులు, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ పాతపాటి సర్రాజు గారు మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవలో గ్రంథి వెంకటేశ్వరరావు తపించేవారని ఆయన భౌతికంగా లేకపోయినా వారి కుమారులు పేదవారికి సహాయం అందించడం అనేది గొప్ప విశేషమని ఘన నివాళులు అర్పించారు.ఆలయ కమిటీ అధ్యక్షులు కంతేటి వెంకట్రాజు ఆలయంలో, మానవసేవే మాధవసేవ అనే పథకం లో భాగంగా ప్రతి నెలా పేద మహిళలకు వృద్ధులకు అనేక వస్తువులు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో సింగపూర్ అప్పన్న, కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సర్వికల్ రామారావు, రైమ్ కార్యదర్శి సింగపూర్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సరిపిడకల రామారావు,రైతు కార్యాచరణ సమితి సభ్యులు పాతపాటి మురళి కృష్ణంరాజు,తదితరులు పాల్గొని GVR కు ఘన నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *