సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హీరో నితిన్ కు బీష్మ వంటి సూపర్ హిట్ తరువాత ‘రంగ్ దే’, ‘మాస్ట్రో’, ‘మాచర్ల నియోజకవర్గం ’ వంటి చిత్రాలన్నీనిరాశ పరిచాయి. మరి ఈసారి కిక్, రేసుగుర్రం లాంటి సినిమాల కధ మాటల రచయిత.. అల్లు అరుజున్ తో నా పేరు సూర్య.. సినిమాతో దర్శకుడిగా మారిన వక్కతం వంశీ దర్శకత్వంలో సీనియర్ హీరో రాజశేఖర్ ప్రత్యక పాత్రలో చేసిన ఏక్సట్రా సినిమా నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కధ విషయానికి వస్తే.. అభి అలియాస్ అభయ్ (నితిన్)కు చిన్నప్పటి నుంచి మరో వ్య క్తిలా ఉండటమంటే ఇష్టం . ఆవ్యక్తిత్వమే అతన్ని జూనియర్ ఆర్టిస్ట్గా మారుస్తుంది. కానీ, తనకెంత ప్రతిభ ఉన్నా జూనియర్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలో సరైన గుర్తింపు, దక్కదు. అలా సాగిపోతున్న అతని జీవితం లోకి లిఖిత (శ్రీలీల) ప్రవేశిస్తుంది. ఆమె ఓ పెద్ద కంపెనీకి సీఈఓ. తనతో అభి ప్రేమలో పడ్డాక.. అతని జీవితం లిఖిత వాళ్ల కంపెనీలో సీఈవో స్థాయికి చేరుకొంటుంది. సరిగ్గా అదే సమయంలో అతనికి సినిమాలో హీరోగా చేసే అవకాశమొస్తుంది. ఆ సినిమా కోసం ఉద్యోగాన్ని .. ప్రేమించిన అమ్మాయిని వదులుకొని వెళ్తాడు అభి .. అయితే సినిమా సెట్స్ పైకి షూటింగ్ కి వెళ్లే సమయానికి దర్శకుడు అభిని కాదని.,మరో హీరోతో ఆ చిత్రం మొదలు పెడతాడు.. అక్కడ నుండి వెండి తెరపై చూడవలసిందే.. ఇక సినిమా ఎలా ఉందంటే.. ప్రేక్షకుల్ని నవ్వించడమే లక్ష్యంగా చేసిన చిత్రమిది. హీరో బాలకృష్ణ అభిమానులపై చెంప దెబ్బలు.. విజయ్ దేవరకొండ – రష్మికల లవ్ .. నరేశ్ – పవిత్రా ల ప్రేమ ఎలిమెంట్స్.. పలు ఎపిసోడ్లో బాగా మిక్స్ చేశారు. ఇక ఇంటర్వెల్ సిన్ హైలైట్..పోలీస్ ఐజీగా.. సీనియర్ హీరో రాజశేఖర్ ఎంట్రన్స్ సన్నివేశాలు.. డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుం టాయి. రాజశేఖర్ కు.. నితిన్కూ మధ్య వచ్చే కొన్ని కామెడీ సన్ని వేశాలు మంచి టైమింగ్ తో తీశారు. లిఖిత పాత్రలో శ్రీలీల అంత ప్రాధాన్యత లేని పాత్రలో పాటలకు పరిమితం అయ్యింది. వక్కతం వంశీ ఈ సినిమాతో కామెడీ ని బాగా హ్యాండిల్ చేయగలనని నిరూపించారు. మొత్తానికి లాజిక్స్ ఆలోచించకుండా చుస్తే.. మంచి ‘ఎక్సట్రా’ కాలక్షేపం సినిమా ఇది..
