సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: మద్రాసు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన ఆ పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే.. సొంత కుమార్తెకు ఆస్తులపై హక్కు ఉంటుందా? లేదంటే అతని సోదరుని పిల్లలకు హక్కు ఉంటుందా? అన్న సందిగ్ధాన్ని కోర్టు పరిష్కరిస్తూ సుప్రీం కోర్ట్ నేడు, శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. హిందూ మహిళ గాని ,ఆమె భర్త గాని చనిపోయిన వాళ్ల ఆస్తి హక్కుకు సంబంధించి .. ఒక వ్యక్తి వీలురాయకుండా చనిపోతే ఆ వ్యక్తి ఆస్తిలో కూతుళ్లకు హక్కు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. ఒకవేళ హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమెకు తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిపై.. తండ్రి వారసులు అందరికీ సమాన హక్కు ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *