సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం తీవ్రత తగ్గాక దేశీయ స్టాక్ మార్కెట్లు లో గత 2వారాలుగా జోష్ పెరిగి అనేక రికార్డ్స్ నమోదు చేస్తున్నాయి. తాజాగా మరో రికార్డును నెలకొల్పాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్ చరిత్రలో తొలిసారి బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 70,000 మైలురాయిని తాకింది. నేడు, సోమవారం ఇంట్రాడేలో 232 పాయింట్లు వృద్ధి చెందిన సమయంలో గరిష్ఠంగా 70,057.83 పాయింట్ల రికార్డును నెలకొల్పింది. మొత్తంగా శుక్రవారం 102 పాయింట్లు లాభపడి 69,928.53 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 65 వేల స్థాయి నుంచి 70 వేల మార్క్‌కు చేరుకోవడానికి 6 నెలల కంటే తక్కువ లేదా దాదాపు 107 సెషన్ల సమయం పట్టింది. ఇదిలావుండగా గతవారమే ఎస్ఎస్ఈ నిఫ్టీ 21,000 మార్కును తాకిన విషయం తెలిసిందే.
