సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ రాష్ట్రం పరిధి వరంగల్ సెక్షన్‌లోనూ, ఆంధ్ర ప్రదేశ్ పరిధి వరంగల్, సూరారెడ్డిపాలెం, ఒంగోలు, విజయవాడ సెక్షన్లలో మూడో రైల్వే లైన్ ఏర్పాట్లు దృష్ట్యా 24 ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఉన్నతాధికారులు తాజగా ప్రకటించారు. ఈ మేరకు గోదావరి జిల్లాల ప్రయాణికులు రద్దయిన రైళ్లను గమనించవల్సి ఉంది. తిరుపతి-పూరిల మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 12,13,15,16,18,19 తేదీలలో రద్దు చేశారు. పూరి-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 13,14,15,17,18,20,21 తేదీలలో రద్దు చేశారు. తిరుపతి-బిలాస్పూర్ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 14,17 తేదీలలో రద్దు చేశారు. బిలాస్పూర్-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 12,16,19 తేదీలలో రద్దు చేశారు. తిరుపతి-విశాఖ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 17న రద్దు చేశారు. విశాఖ-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 18న రద్దు చేశారు. విశాఖ-చెన్నై మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 18న రద్దు చేశారు. చెన్నై-విశాఖ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 12,19 తేదీలలో రద్దు చేశారు. విశాఖ-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 18న రద్దు చేశారు. తిరుపతి-విశాఖ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 12,19 తేదీలలో రద్దు చేశారు.విశాఖ-మహబూబ్‌నగర్ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 16,17 తేదీలలో రద్దు చేశారు. మహబూబ్‌నగర్-విశాఖల మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 17,18 తేదీలలో రద్దు చేశారు. హౌరా-ఎర్నాకుళం మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 16న రద్దు చేశారు
