సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పెళ్లి జరిగి 40 రోజులు కాలేదు.. అంతలోనే నవ దంపతులు అంతర్వేది సముద్ర స్నానానికి వెళ్లి గల్లం తయ్యారు. నరసింహుని దర్శనం తరువాత తిరిగి వస్తారని భావిస్తున్న వారి కుటుంబ సభ్యులకు తీవ్ర ఆవేదన మిగిలింది. జువ్వలపాలెం కు చెందిన లక్ష్మీనారాయణ బీటెక్, బీఈడీ చేసి భీమవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. అతనికి నవంబర్ 1వ తేదీన కలిదిండి మం డలం గుర్వాయిపాలెం గ్రామానికి చెందిన గాయత్రీ తో వివాహం అయ్యింది. కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో కొత్త దంపతులు బైక్ ఫై మధ్యాహ్నం 3 గంటలకు అంతర్వేది దేవాలయాన్ని దర్శించుకుని సాయంత్రం నాలుగు గంటలకు బీచ్‌కు వెళ్లారు. బైక్ ఫై బీచ్‌లో దూరంగా వెళ్లారు. అక్క డ వాహనం , సెల్ ఫోన్ బయట ఉంచి స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. తరువాత కొద్ది సమయానికే వీరు కనిపించలేదు. నిన్న,సోమవారం రాత్రి వరకు పోలీస్ లు గాలింపు చేపట్టిన వారి ఆచూకీ తెలియలేదని సమాచారం. పోలీస్ లు కాస్త లోతుగా దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. వరుడి సెల్‌ఫోను ఆధారం గా బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్లో వరుడి తండ్రి బసవలిం గం ఫిర్యాదు చేసారు.
