సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ ఎన్నికల తరువాత అక్కడి ఫలితాలు తీరుతో.. మరో 3 లేదా 4 నెలలు లో ఎన్నికలు జరగనున్న ఏపీ రాజకీయాలలో పెను మార్పులు వస్తున్నాయి. ముందుగా అధికార వైసిపి ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయం సాధించి తీరాలని మొండి పట్టుదలతో.. ఈసారి, బీసీ అభ్యర్థుల సంఖ్య పెంచడంతో పాటు మరియు తనకు ఆయా స్థానాలలో వచ్చిన రిపోర్ట్ లో తేడా వస్తే ఎంతటి నేతకైనా, ఎమ్మెల్యే కైనా ఉద్వాసన చెప్పడానికి సీఎం వైఎస్ జగన్ వెనకాడటం లేదు. తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చాక స్థానాలు కోల్పోయిన వారికీ గౌరవ పదవులు ఇస్తామని భరోసాలు ఇస్తున్నారు.ఇంకా స్థానాల కేటాయింపు కూడా జరుగని టీడీపీ జనసేన పొత్తును చిత్తూ చెయ్యడానికి, సీఎం జగన్ తనకు ఎలానూ అండగా ఉంటారని భావిస్తున్న ఎస్ సి, ఎస్టీ లకు తోడు బీసీ లకు అగ్రతాంబూలం ఇస్తూ ఎన్నికల సమరంలోకి వెళ్లాలని ప్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముందుగా నియోజకవర్గాల ఇంచార్జిలను మారుస్తున్నారు. ఈ క్రమంలో 11మంది ఇంచార్జి లను కొత్త సమన్వయకర్తలను నియమించారు. ముందే విషయం తెలిసి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి చాల గౌరవంగా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా పద్మశాలి.. చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని నియమించారు. ఈ నేపథ్యంలో అందుతున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో వైసీపీ గెలిచిన 151 సీట్లలో మొత్తం 60 వరకు అభ్యర్థులను మార్చే అవకాశం? ఉందని తెలుస్తుంది.. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో వైసిపి గెలిచిన 5స్థానాలలో 2స్థానాలలో అభ్యర్థులు మార్పు? తప్పద్దని భావిస్తున్నారు. అయితే ఇందులో భీమవరం మాత్రం లేదు.. మరి మిగిలిన 4గురిలో.. వీరి వీరి గుమ్మడి పండు..
