సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు ఢిల్లీలో రచ్చబండ కార్యక్రమంలో నేడు, మంగళవారం మీడియా తో మాట్లాడుతూ.. వైసిపి పార్టీ లో అసంతృపి పర్వము మొదలయిందని, అక్కడ అధిష్టానం నుండి ప్రజా ప్రతినిధులకు గౌరవం కరువయింది. వచ్చే ఎన్నికలలో పడవ మునిగిపోతుంది.. జనవరి నెలాఖరు నాటికి 35 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు వైసిపి నుండి వీడే ఛాన్స్ ఉందని జోస్యం చెప్పారు. కృష్ణా జిల్లాలోని మాజీ మంత్రి ఒకరు పక్క పార్టీల వైపు చూస్తున్నారని చెప్పారు. విశాఖలో నాదెండ్ల మనోహర్ అక్రమ అరెస్టును పరిశీలిస్తే… రాష్ట్రంలో గాంధేయ మార్గంలోనూ నిరసన తెలిపే అవకాశం లేదన్నది స్వష్టం అయ్యిందన్నారు. భీమవరంలోని విష్ణు కాలేజీ రోడ్డు ( బివి రాజు మార్గ్) భారీ గోతులతో పట్టించుకొనే నాధుడు లేకుండా పోయిందని, రోజు వేలాది విద్యార్థులు, తాడేపల్లి గూడెం వైపు రాకపోకలు సాగిస్తున్న వాహనాలు ప్రయాణికులు ఎందరో గాయాలు పాలు అవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, అక్కడ గోతులు పూడ్చడానికి అవసరమైతే ఎంపీ నిధులను వినియోగించాలని కలెక్టర్ పి ప్రశాంతి గారికి విజ్ఞప్తి చేసానని అన్నారు.
