సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం లోక్ సభలో తీవ్ర ఆందోళన కలింగించే ఘటన జరిగింది. ఇది నూతన పార్లమెంట్ భవనంలో భద్రత వ్యవస్థ లోపాలను బహిర్గతం చేసింది. లోక్ సభ సమావేశాలు జరుగుతున్నా నేపథ్యంలో గ్యాలరీ నుంచి ఇద్దరు అగంతుకులు లోక్‌సభలోకి దూకి తమ షూ లో దాచుకొన్న చిన్న టిన్ ల ద్వారా టియర్ గ్యాస్‌ను వదిలారు. భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. దీంతో వెంటనే ప్యానల్ స్పీకర్ సభను వాయిదా వేశారు. ఎంపీలు భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో దేశం అంతటా మీడియాలో ఆ దృశ్యాలను ప్రజలు విస్తుపోయి చూసారు. స్పీకర్ వైపు ఓ ఆగంతకుడు పరిగెత్తాడు. కాగా 2001లో ఇదే రోజు పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి చేశారు. 22 ఏళ్ల తర్వాత పార్లమెంట్‌పై మరోసారి దాడి జరిగింది. అయితే ఆ ఇద్దరిని సెక్యూరిటి సిబ్బంది పట్టుకున్నారని, వారిని విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
