సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసిపి పార్టీ కేం ద్ర కార్యా లయం నుండి వెలువడిన ఉత్తర్వులు మేరకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగ రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న జక్కంపూడి గణేష్ ను రాష్ట్ర యువజన విభాగ జోనల్ ఇంచార్జి గా నియమించారు. తనకు ఈ కీలక పదవి ఇచ్చిన సీఎం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శిగా ఆచంట అనసూయ నియమితులయ్యారు. ఈమె గోపాలపురం నియోజవర్గ కన్వీనర్ గా ఉన్నారు, చిన తిరుమల గా ప్రసిద్ధి పొందిన ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *