సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ ఎన్నికల తరువాత ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు తో జనసేన అధినేత పవన్ సమావేశంల అయ్యాక.. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో త్వరితంగా ఇరు పార్టీల పొత్తులో బాగంగా ఎట్టి పరిస్థితులలో వచ్చే జనవరి నెలలో ఇరు పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాలు లిస్ట్ ప్రకటించాలని ప్రకటించడానికి అవగాహనా కుదిరింది, దీనిలో భాగంగా జనసేన తమకు కేటాయించవలసిన సుమారు 50 స్థానాలలో తమ కు బలం ఉన్న సీట్ల లిస్ట్ ఇప్పటికే టీడీపీ అధిష్టానానికి ఇచ్చినట్లు సమాచారం. అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఇప్పటికే ‘జనసేన’కు కేటాయింపు కు పక్కాగా అంగీకారం టీడీపీ అంగీకరించింది అని భావిస్తున్న 18 సీట్లు వివరాలు..భీమవరం నుండి జనసేన అధినేత, కొణిదెల పవన్ కల్యాణ్, తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్, నరసాపురం – బొమ్మిడి నాయకర్, తెనాలి నుండి నాదెండ్ల మనోహర్,గజపతినగరం – పడాల అరుణ, గాజువాక – సుందరపు సతీష్ ,భీమిలి – పంచకర్ల సందీప్, పెందుర్తి – పంచకర్ల రమేష్ బాబు ,యలమంచిలి – సుందరపు విజయకుమార్ ,ముమ్మిడివరం – పితాని బాలకృష్ణ ,రాజానగరం – బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రి రూరల్ – కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ – పంతం నానాజీ, పిఠాపురం – ఉదయ్ శ్రీనివాస్, రామచంద్రాపురం – చిక్కం దొరబాబు ,జగ్గంపేట – పటంశెట్టి సూర్యచంద్రరావు ,రాజోలు – డీఎంఆర్ శేఖర్, ,విజయవాడ వెస్ట్ – పోతిన మహేష్, పేర్లు ఉన్నాయి. మరల ఇరు పార్టీల చర్చల తదుపరి జనసేన కు టీడీపీ మరికొన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉంది. అయితే బీజేపీ వీరితో కలసి వచ్చే అవకాశం ప్రస్తుతం కనిపించడం లేదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *