సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో అటు బాలీవుడ్, ఇటు దక్షిణాదిన తెలుగు సినిమా తప్ప అన్ని సినీ పరిశ్రమలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. తెలుగు సినిమా కూడా కరోనా ప్రభావం వల్ల తీవ్ర నష్టం ఎక్కువ సినిమా థియేటర్లు యజమానులు భరించారు తప్ప, సినిమా నిర్మాతలపై అంతగా ప్రభావం లేదు..ఇప్పడు దేశం మొత్తం తెలుగు సినిమా వైపు మాత్రమే చూస్తుంది.. ఈ ఏడాది మొదటి మూడునెలలలో క్రాక్, రెడ్, ఉప్పెన, జాతిరత్నాలు, వకీల్ సాబ్ మంచి కలెక్షన్స్ తో ఘనవిజయాలు సాధించాయి. ఓటిటి లో వెంకిమామ చేసిన నారప్ప, దృశ్యం మంచి విజయాలు నమోదు చేసాయి. కరోనా ఫస్ట్ వేవ్ తగ్గిన తర్వాత తెరుచుకున్న థియేటర్స్ లో చిన్న సినిమాలు సందడి చేశాయి. సెకండ్ వేవ్ కంట్రోల్ అయిన తర్వాత థియేటర్స్ లోకి వచ్చిన మాస్ మూవీస్ అదరగోట్టాయి.. దసరా పండగ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ పరుగులు పెట్టింది. ఎస్ ఆర్ కళ్యాణమండపం,పెళ్లి సందడి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, లవ్ స్టోరీ, శ్యాం సింగరాయి సినిమా లు విజయాలు సాధించగా అఖండ, బంగార్రాజు సినిమాలు ఘనవిజయం సాధించాయి. ఇక పుష్ప తెలంగాణాలోను దేశవ్యాప్తంగా మంచి కలెక్షన్ రాబట్టి నప్పటికీ ఏపీలో కొన్ని ప్రాంతాలలో నష్టాలు చవిచూసింది అని రిపోర్ట్.. ఇప్పుడు తెలుగునాట ఇప్పుడే పుంజుకొంటున్న కరోనా కేసులు.. థర్డ్ వేవ్ మర్చి నెలలో తగ్గిపోతుందని భావిస్తున్నారు. అందుకే మార్చి మూడో వారం లేదా చివరి వారంలో బాక్సాఫీస్ ముందుకు వచ్చేందుకు పాన్ ఇండియా సినిమాలు.. రాధేశ్యామ్ , ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలు అన్ని కుదిరితే మార్చి 18న రిలీజ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కుదరక పొతే ఆర్‌ఆర్‌ఆర్‌ ఏప్రిల్‌ 28న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *