సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తుపాను కారణంగా తమిళనాడు తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, రైతులు పంట నష్టపోయారో తెలిసిందే.. అయితే గత 10 రోజులుగా వర్షాలు పడకపోవడంతో ప్రజలు రైతులు ఊపిరి తీసుకొన్నారు. అయితే మరల వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాయలసీమ , కోస్తా ఆంధ్ర లో వాతావరణం బాగా చల్లబడి చలిగాలులు వీస్తున్నాయి. నేడు, శనివారం అక్కడక్కడ వర్షం పడుతుంది. మరో 3 రోజులు పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. తమిళనాడు లోని దక్షిణాది జిల్లాల్లోనూ, తంజావూరు, తిరువారూరు, నాగపట్టినం, మైలాడుదురై సహా డెల్టా జిల్లాలలోనూ కుండపోతగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
