సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమీషన్, వెలగ పూడి, ఆంధ్ర ప్రదేశ్ వారు.. పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం డివిజన్ లో అత్యధికంగా ఓట్లు నమోదు చేసినందుకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అధికారి ఉత్తమ అవార్డు ప్రకటించారు. ఈ అవార్డు జనవరి 25వ తేదీన ఎలక్షన్ కమిషనరు కార్యాలయం వెలగపూడి లో ఈ ఉత్తమ అవార్డును సబ్ కలెక్టర్, సి . విష్ణు చరణ్ కు అందజేస్తారు.ఈ సందర్భంగా నేడు, శనివారం, నరసాపురం డివిజన్ సబ్ కలెక్టరు కార్యాలయం ఏవో , అధికారులు, సిబ్బంది పూలబొకేలతో సబ్ కలెక్టర్ ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. నాకు ఈ అవార్డులు రావడం అన్నది మన అందరి సమిష్టి కృషి వల్లే జరిగిందని, అందుకే నాతో పాటు మీరు అందరూ చాలా సంతోషించాల్సిన విషయం అన్నారు. అవార్డులు మనకు మరింత బాధ్యతను పెంచుతాయని. ఇదే స్ఫూర్తితో డివిజన్లో రాష్ట్ర ప్రభుత్వం గాని ఎలక్షన్ కమిషన్ గాని ఏ కార్యక్రమం తలపెట్టినా సమిష్టిగా పనిచేసి విజయవంతం చేద్దామని సబ్ కలెక్టర్ శ్రీ సి విష్ణు చరణ్ సూచించారు.ఈ కార్యక్రమంలో ఏ వో యస్.వి.సుబ్రమణ్యం, కె. ఆర్.సి. తశీల్దార్ ఆర్.వి. కృష్ణా రావు, తది తరులు పాల్గొన్నారు.
