సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు వారికీ ఇష్టమైన పండుగ సంక్రాంతి. మరి పండుగ రేసులో ఇటీవల కాలంలో చూడని విధంగా ఈ సారి ఒకటి కాదు రెండు కాదు అయిదు సినిమాలు దూసుకొని వస్తున్నాయి. అయితే వీటిలో పెద్దోడు- చిన్నోడు వేరువేరుగా వస్తున్నా సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అయితే మిగతా మూడింటిని తక్కువ అంచనా వెయ్యలేము.. ఎవరికి వాళ్లే పండుగ విజేత తమ సినిమాయే అని భావిస్తున్నారు. మరి ప్రేక్షకులు ఏమి తీర్పు ఇస్తారో కానీ.. ఆ 5 సినిమాలు ఇవే.. మొదటిది గుంటూరు కారం .. సూపర్ స్టార్ మహేష్ బాబు.. త్రివిక్రమ్ కాంబినేషన్ మూడవ సినిమాగా భారీ అంచనాలతో వస్తుంది; .సంక్రాంతి హీరోగా ఎఫ్ 2 తో 150 కోట్ల క్లబ్ లో చేరిపోయిన వెంకటేష్ మరోసారి యాక్షన్ హీరో సైంధవ్ గా పుల్ ఎనర్జీ తో పాన్ ఇండియా హీరోగా దూసుకొనివస్తున్నాడు.. ఈ రెండు సినిమాలకు థియేటర్ల సమస్య లేనే లేదు. ఇక మంచి హిట్ కోసం 6 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా హీరో నాగార్జున నా సామి రంగ’ మాస్ సినిమాను బరిలోకి దింపుతున్నారు. హీరో రవితేజ ‘ ఈగల్’ సినిమా తోనూ.. ఎంతో కాలంగా రిలీజ్ లు వాయిదాలు పడుతూ వస్తున్నా హనుమాన్.. ఈ సంక్రాంతి కి లంఘిస్తామంటున్నారు.. మొత్తానికి పందెపు కోళ్లకు మించి ఈ సంక్రాంతి సినిమాల జోరు ఉండబోతుంది. మరి వాటికీ వచ్చే టాక్ మాత్రమే ఆ సినిమాలకు థియేటర్స్ కొరత తీరుస్తుంది మరి..
