సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి వాసులకు , ప్రయాణికులకు ముఖ్య గమనిక.. నేడు, శనివారం భీమవరంలో రైల్వే భద్రతా అధికారి వి. నాగేశ్వరరావు ఒక ముఖ్య సమాచారం తెలియజేసారు. కాల్దరి మరియు అంబేద్కర్ కాలనీ, శెట్టిపేట (రైల్వే గేట్ 164) ; కాల్దరి – శెట్టిపేట (రైల్వే గేట్ 163)గ్రామాల రహదారి మార్గంలో లెవెల్ క్రాసింగ్ గేట్ నెంబర్లు 163 , 164 వద్ద నిర్మించనున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ (RUB) పనుల కోసం ఫిబ్రవరి 10 నుంచి మార్చి 25 వరకు 45 రోజుల పాటు రైల్వే గేటు తాత్కాలికంగా మూసిఉంచడం జరుగుతుందని ఒక ప్రకటన లో తెలియ చేశారు .ఈ విషయమై జిల్లా కలెక్టర్, పశ్చిమ గోదావరి జిల్లా వారికి జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యన్నాయ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించే దిశగా క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు జారీ చేయాల్సిందిగా కోరుతూ రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ జి ఎన్ ఏ శివకుమార్ లేఖ వ్రాయడం జరిగిందని ఆయన తెలిపారు.విషయం పై ముందస్తుగా ప్రజలకు అవగాహన కల్పించాలని రైల్వే సంస్థ తరపున కోరడం జరిగిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *