సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరంలో త్యాగరాజ స్వామి 175వ వర్ధంతి కార్యక్రమాన్ని త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ అధ్వర్యంలో త్యాగరాజ భవనంలో నిర్వహించారు. ముందుగా త్యాగరాజ స్వామి సీతారామ లక్ష్మణ హనుమంత్ ఉత్సవ విగ్రహాలతో పల్లకిలో ఊరేగించారు. అకాడమీ అధ్యక్షులు ఉద్దరాజు కాశీ విశ్వనాథ్ రాజు మాట్లాడుతూ.. గత 103 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాలు గత ఏడాది కరోనా వల్ల నిర్వహించ లేదని, ప్రస్తుతం కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ ఏడాది మే నెలలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ వెంకట్రామయ్య, మాట్లాడుతూ.. ప్రతి నెల గాత్రా కచేరీ, సన్నాయి, పంచ రత్న కీర్తనలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అనంతరం విద్వాంసులు కొప్పర్తి విజయ లక్ష్మి, కురిశేటి లక్ష్మి నాగమణి బృందం పంచ రత్న కీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో అకాడమీ కోశాధికారి రామమూర్తి, రంగసాయి , ప్రకాశరావు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, కారుమురి బాబు, నరహరిశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
