సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి ఒక సాధారణ జర్నలిస్ట్ గా ప్రయాణం ప్రారంభించి తదుపరి ఫిల్మ్ జర్నలిస్టుగా తదుపరి 25 ఏళ్ళ క్రిందటే సంతోషం ఫిల్మ్ వీక్లీ పత్రిక, వీడియో వీక్లీ పత్రికలతో పాటు సంతోషం ఫిలిం అవార్డులు ఏర్పాటు చేసి అట్టహాసంగా వాటిని తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో దిగ్విజయంగా దశాబ్దాలుగా నిర్వహిస్తూ.. సినీ డిస్ట్రిబ్యూటర్స్ గా తదుపరి సినీ డబ్బింగ్ సినిమాల నిర్మాతగా జర్నీ, ప్రేమిస్తే, విక్రమ్.. నాన్న వంటి పలు సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించి, పలుసార్లు నటుడుగా కూడా మెఱసి.. అంచెలు అంచెలుగా ఎదిగిన సురేష్ కొండేటి కి ప్రస్తుతం ఒక తప్పిదంతో భారీ మూల్యం చెల్లించాలని, సినీ పరిశ్రమకు దూరంగా ఉండాలని సినీ ప్రముఖులు తీర్మానించారు. ఇటీవల గోవా లో సంతోషం సినీ అవార్డ్స్ దక్షిణాదికి చెందిన నాలుగు భాషల నటీనటులు, సాంకేంతిక నిపుణలు, నిర్మాతలకి ఇస్తామని తీరా అక్కడికి వారిని ఆహ్వానించి తీవ్ర ని అసౌకర్యానికి గురిచేయడమే కాకుండా, గందరగోళంతో .. తెలుగు చిత్ర పరిశ్రమకి చెడ్డ పేరు తీసుకుని వచ్చాడని అతని మీద చర్య అనివార్యం అయింది కొన్ని రోజుల క్రితమే తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ మరియు నిర్మాతల మండలిలో చర్చించిన పిదప అందరూ ఏకగ్రీవంగా సురేష్ కొండేటిని బహిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు కార్యనిర్వాహక సభ్యులు అందరిలో ఒక్కరు కూడా సురేష్ కొండేటికి మద్దతుగా నిలవకపోవటం? దీనితో సురేష్ కొండేటికి నిర్మాతల మండలి నుండి, తెలుగు ఫిలిం ఛాంబర్ నుండి అధికారికంగా బహిష్కరించినట్టు తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి ప్రసన్న కుమార్ నేడు, శనివారం అధికారికముగా ప్రకటించారు. ఇంతవరకు సినీ పరిశ్రమ నుండి అతను పొందిన రాయితీలు ఇకముందు నుండీ ఏవీ అతనికి ఇక రావని తెలిసింది. స్విజర్లాండ్ నుండి మంచు విష్ణు వచ్చాక సురేష్ కొండేటి ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నుండి బహిష్కరించే ?అవకాశాలు వున్నట్టుగా తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *