సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ఈనెలలో పలు సార్లు వాయిదా పడుతూ వస్తున్న సీఎం జగన్ పర్యటన ఎట్టకేలకు ఈనెల 29 వ తేదీన ఖరారు అయినట్లు సమాచారం. ఆరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు పీజు రియంబర్స్ నిధులను జగనన్న విద్య దీవెన’ పధకం క్రింద సీఎం జగన్ ఇక్కడ బహిరంగ సభ నుండి విడుదల చెయ్యనున్నారు. అలాగే పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన పలు అభివృద్ధి నిర్మాణాల ప్రారంభోత్సవాలు కూడా నిర్వహించనున్నారు. భీమవరంలో జగన్ హెలిప్యాడ్ కు లూధరన్ హైస్కూల్ గ్రౌండ్ ఇప్పటికే సిద్ధం చేసిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ తాజగా పోలీస్ అధికారులతో కలసి పరిశీలించి భద్రతా పరం అయిన ఏర్పాట్లు ను పర్యవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *