సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇటీవల తండ్రి జివిఆర్ మరణ విషాదం నుండి తేరుకొని గత 3 రోజులుగా తిరిగి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, కోవిద్ కట్టడి చర్యలు, నియోజక అభివృద్ధికి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భముగా తమ కుటుంబానికి మనోబలాన్ని పెంచిన ఆప్తులకు కృతఙ్ఞతలు తెలుపుతూ పెట్టిన పోస్టులో.. మా కుటుంబానికి పెద్ద దిక్కు,మా ఉన్నతి కై ఎనలేని కృషి చేసిన మా తండ్రి గ్రంధి వెంకటేశ్వరరావు(GVR) గారు శివైక్యం పొంది మాకు దూరమై తిరిగిరాని లోకాలకు వెళ్లిన సమయంలో మేము ధైర్యం కోల్పోకుండా, మనోవేదనతో కృంగిపోకుండా, స్వయంగా వచ్చి, అలాగే పత్రికా ముఖంగా గాని, ఫోన్ ద్వారా గాని మాకు అండగా మేమున్నామంటూ వెన్ను తట్టి ధైర్యం చెప్పిన మీ అందరి సహయ సహకారాలతో మా తండ్రి చూపిన బాటలో పయనిస్తాం…ఈ కష్టకాలంలో అండగా నిలిచిన ఆత్మీయ స్నేహితులకు, బంధువులకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, వివిధ సంఘాల ప్రతినిధులకు ,అధికారులకు ప్రజాప్రతినిధులకు, నమస్కరిస్తూ మీరు చూపిన ప్రేమ, అభిమానం మాకు ఎంతో మనోధైర్యన్ని ఇచ్చింది మీ ప్రేమ, అభిమానం రుణం తీర్చుకోలేనిది.మాకు ఎల్లప్పుడూ మీ ప్రేమాభిమానాలు, అండదండలు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞత పూర్వక నమస్కారాలు తో …మీ గ్రంధి శ్రీనివాస్ శాసనసభ్యులు మరియు కుటుంబ సభ్యులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *