సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వైసిపి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇక తాను వైఎస్‌ రాజశేఖరరెడ్డి బిడ్డ వైఎస్‌ షర్మిల వెంటే ఉంటానని.. ఆమెతో ఇప్పటికే చర్చించానని.. ఆమె భవిష్యత్‌లో ఏ పార్టీలో చేరితే ( కాంగ్రెస్ ?) తానూ అదే పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తానని తెలిపారు. జగన్ సర్కార్ సంక్షేమం పై దృష్టి పెట్టి.. అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. ఏ ప్రభుత్వానికైనా సంక్షేమం, అభివృద్ధి రెండూ రెండు కళ్లు వంటివని.. ఒంటికన్నుతో రాణించాలనుకోవడం ఆత్మహత్యాసదృశమన్నారు. వైసీపీ హయాంలో అభివృద్ధి దాదాపు స్తంభించిందని చెప్పారు. ‘మంగళగిరికి దూరంగా ఉండలేను. విలువలకు లోబడి జీవిస్తా. అని తెలిపారు. జగన్‌ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి కోసం రూ.125 కోట్లకు జీవో విడుదల చేసి పరిపాలన అనుమతులిచ్చాం.. పనులు చేసుకోమన్నారు. ఆ పనులు చేసి నెలలు గడుస్తున్నా.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెట్టారు.కాంట్రాక్టర్ల ఇబ్బందులు చూడలేక నేనే వడ్డీపై అప్పు తెచ్చి ఏడెనిమిది కోట్లు తెచ్చి వారికిచ్చాను.. నేను రాజశేఖరరెడ్డి అభిమానిని. ఆ అభిమానంతోనే ఆయన కొడుకు వెంట నడిచా. అయిందేదో అయిపోయింది. ఇక మళ్లీ వెనుదిరిగేదిలేదు. అలాగే టీడీపీ నేతలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబుపై వేసిన కేసులను ఉపసంహరించుకోను. తప్పులు చేసినవాళ్లు శిక్ష అనుభవించాలి కదా! సీఎం జగన్ తప్పు చేసిన కేసు వేస్తాను అంటూఅని కొసమెరుపు మెరిపించారు ఆర్కే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *