సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల జనవరిలో ఒమిక్రాన్, రష్యా అమెరికా ఉద్రిక్తతలు,ఫెడ్‌రల్ బ్యాంకు వడ్డీ రేట్లు మార్కెట్‌పై పను ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లోని స్టాక్ మార్కెట్‌పై బేర్ పంజా విసిరింది. వరుసగా ఐదో రోజు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు భారీ నష్టాలు చవి చూస్తున్నారు. స్మాల్, మీడియం, లార్జ్ క్యాప్ అని తేడా లేకుండా అన్ని విభాగాల్లో షేర్లు నష్టపోతున్నాయి. ఆ ప్రభావం ఇండియాలోని సెన్సెక్స్, నిఫ్టీ సూచీలపై స్పష్టంగా కనిపిస్తోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఈ రోజు సగం సెషన్ పూర్తయ్యే సరికే వెయ్యికి పైగా పాయింట్లను కోల్పోయింది. నేటి, సోమవారం మధ్యాహ్నం 12:25 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 1058 పాయింట్లు నష్టపోయి 57,978 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. లార్జ్ క్యాప్ కంపెనీల షేర్ల ధరలో 1.79 శాతం క్షీణత నమోదు అయ్యింది. మీడియం, స్మాల్ కేటగిరిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సరిగ్గా వారం రోజుల వ్యవధిలో నిఫ్టీ 1005 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 2350కి పైగా పాయింట్లను కోల్పోయింది. గడిచిన వారం రోజుల్లో 12 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి అయిపొయింది.
