సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, నూతన సంవత్సరం భారత్ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో మరో ఘనత సాధించారు. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్లో సీ58 వాహకనౌక ద్వా రా ఎక్స్ -రే పోలారి మీటర్ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్య లోకి ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట.. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ-58 (PSLV C-58) రాకెట్ నేటి సోమవారం ఉదయం 9.10 గంటలకు నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకుపోనుంది. కౌంట్ డౌన్ ప్రక్రియ 25 గంటల పాటు కొనసాగనుంది. 418 కిలోలు బరువు ఉండే ఎక్స్‌ఫోశాట్, కేరళ యూనివర్శిటీ విద్యార్ధులు రూపొందించిన విఐవై (VIY) నానాశాట్‌లని శాస్త్రవేత్తలు రోదసీలోకి పంపారు. భూ ఉపరితలానికి 650 కి.మీ ఎత్తులోని వృత్తాకార కక్ష్యలోకి శాటిలైట్లను పంపేలా డిజైన్ చేశారు. అంతరిక్ష రహస్యాల కోసం ఎక్స్‌ఫోశాట్ (EXPO SAT) రూపకల్పన. టెలిస్కోప్‌లా పనిచేస్తూ ఖగోళంలో బ్లాక్ హోల్స్, పాలపుంతలు, ఎక్స్ రే కిరణాలపై పరిశోధనకి ఉపయోగపడుతుంది. ఎక్స్‌ఫోశాట్ జీవితకాలం అయిదేళ్లు ఉంటుంది.
