సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆసేతు హిమాచలం మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. నేడు, శనివారం ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించి,స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. జాతిని ఉద్దేశించిప్రసంగించారు. వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు, వికసిత భారత్ లక్ష్యంగా యువశక్తి ప్రాధాన్యతను ఆయన వివరించారు.. రానున్న సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ఏఐ స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో కోటి మంది యువతకు ఏఐ శిక్షణ ఇవ్వబోతున్నట్టు మోదీ తెలిపారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్దమయ్యే యువతకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ ఇవ్వనున్నట్టు తెలిపారు.భారత్ శత్రు దుర్బేజితంగా మారిందని,శాస్త్ర సాంకేతిక రంగాలలో అంతరిక్షం లో అద్భుత విజయాలతో ప్రపంచానికి ఆదర్శనంగా నిలుస్తుందన్నారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, తొలిసారి ఎర్రకోటలో వందేమాతరం ఆలపించామని తెలిపారు. దేశ ప్రజలంతా పెద్ద కలలు కనాలని అప్పుడే భారత్ అగ్ర దేశం అవుతుందని పిలుపునిచ్చారు.
