సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్త ఏడాది కి ఆహ్వానం పలుకుతూ మందు బాబులు ఖుషి చేసుకొన్నా నేపథ్యంలో డిసెంబర్ 30,31, జనవరి 1 తేదీలలో కేవలం 3 రోజులలో 16 కోట్ల రూపాయలు పైగా విక్రయాలు జరిగినట్లు సమాచారం.. ఉమ్మడి జిల్లాలో 140 మద్యం షాపులు, 16 బార్లు, 12 వాకిన్ స్టోర్స్ ఉన్నాయి. వీటికి భీమవరం , ఏలూరు ,నిడమనూరు, గొల్లపూడి, ఏలూరు, చాగల్లు, గుడివాడ లిక్కర్ డిపోల నుంచి జిల్లాలో షాపులు, బార్లకు మద్యం సరఫరా అవుతుంది. రోజుకు సగటున రెండు కోట్ల 70 లక్షల రూపాయల మద్యం విక్రయాలు జరుగుతుండేవి. అయితే నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబరు 30న నాలుగు కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరుగగా, 31న రూ.ఆరు కోట్ల మద్యం, జనవరి 1వ తేదీన ఆరున్నర కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. మొత్తంగా మూడు రోజుల్లో మందు బాబులు కొత్త ఏడాది పేరు చెప్పుకొని సుమారు పదహారున్నర కోట్ల రూపాయల లిక్కర్ తాగి పడేసారు.
