సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల దేశవ్యాప్తంగా వయస్సుతో ప్రమేయం లేకుండా అందరికి వత్తిడే .. దానికి తోడు వారు తినే ‘పాస్ట్ ఫుడ్ తిండి’ కూడా షుగర్ కేసులను పెంచేస్తుంది. పెద్దలలో లేదా చిన్నారుల్లో మధుమేహాన్ని( షుగర్) కొలిచేందుకు సూదితో పొడిచి శరీరం నుంచి రక్తం తీస్తున్నప్పుడు నొప్పి పుట్టకుండా కేవలం వ్యక్తి చెమట చుక్కతో షుగర్ లెవెల్స్ తెలుసుకొనేందుకు పశ్చిమ గోదావరి జిల్లా, గణపవరం దగ్గరలోని నారాయణపురానికి చెందిన శాస్త్రవేత్త చిరంజీవి శ్రీనివాసరావు కొత్త ఆవిష్కరణ చేసారు. సదరు వ్యక్తి చెమటను పరీక్షిం చి నిమిషంలో మధుమేహాన్ని లెక్కించొచ్చు . ఈ పరికరాన్ని బాగా పరీక్షించిన భారత ప్రభుత్వం అతని ‘గ్లూకోజ్ ఎలక్ట్రోకెమికల్’ పరికరానికి పేటెంట్ హక్కు లు ఇస్తూ ఇటీవల సర్టిఫికెట్ జారీ చేసింది.దీనితో ఆయన జిల్లా నేతలు వైద్య ప్రముఖులతో అభినందనలు అందుకొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *