సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో బీజేపీ తో పొత్తు కొనసాగిస్తూనే ఇటీవల తెలుగు దేశం తో పొత్తు పెట్టుకొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బీజేపీ దోస్తీ కి నీళ్లు వదులుకోవడానికి సిద్ధంగా ఉందని సంకేతాలు వచ్చాయి. నేడు, మంగళవారం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈసారి లోక్ సభ ఎన్నికలలో తెలంగాణ లో బీజేపీ గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో కేంద్ర పార్టీ అధిష్టానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సిట్టిం గ్ ఎం పీలకు సీటు గ్యారంటీ అని ఎక్కడా చర్చ జరగలేదని అన్నారు. ఈ నెల 7,8 తేదీల్లో పార్లమెంట్ ఎన్నికల కోసం కమిటీలు వేస్తున్నామని బీజేపీ నేతల సమావేశం ఉంటుందన్నారు. ఈ దశలో తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో జనసేనతో బీజేపీ పొత్తు ఉండకపోవచ్చని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం గా ఉన్నామని, ప్రస్తుతానికైతే జనసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యలలో ఇక జనసేనకు బీజేపీ దూరం అని సంకేతాలు స్వష్టంగానే ఇచ్చారు. మరి ఈ పరిస్థితులలో పవన్ కళ్యాణ్ కోరుకొంటునట్లు ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తు సాధ్యమయేనా ?
