సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ్ళ టీడీపీ జనసేన ఒక జట్టుగా అధికార వైసిపి ని దెబ్బ కొట్టేందుకు ప్యూహం రచిస్తుంటే.. మరో ప్రక్క జనసేన పార్టీకి గోదావరిజిల్లాలలో, కృష్ణ జిల్లాలో ఉన్న కాపు మద్దతుదారులను తనవైపు త్రిపుకొనేందుకు అధికార వైసిపి ఎత్తుగడలు వేస్తుంది. దీనితో పరోక్షంగా టీడీపీ కి కాపు ఓట్ల మద్దతు శాతం తగ్గించవచ్చు. దీనికి కొత్త సంవత్సరం మొదటి రోజు వేదిక అయ్యింది. గోదావరి జిల్లాలలో కాపునేతలను ఆహ్వానిస్తూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీలలో కీలక కాపు నేతలతో పాటు ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న అత్యంత కీలక నేత కాపునాడు సృష్టికర్త ముద్రగడ పద్మనాభం ఏర్పాటు చేసిన సమావేశానికి విందుకు భారీ సంఖ్యలో కాపు నేతలు హాజరయినట్లు సమాచారం..మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపుల సం క్షేమ కోసం దశాబ్దాలుగా అనేక పోరాటాలు చేశారు. ఆయన కచ్చితంగా అధికార వైసిపి పార్టీలో చేరతారని ఆయన చిన కుమారుడు గిరిబాబు తో సహా 2 నియోజకవర్గాలలో వైసిపి పార్టీ టికెట్స్ వారికీ ఖరారు అయ్యాయని, ముద్రగడ కు ఇష్టమైతే కాకినాడ లోక్ సభ కు వైసిపి అభ్యర్థిగా బరిలో దిగుతారని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇక కాపులు వంగవీటి మోహన్‌రంగాను తమ దేవుడిగా గా భావిస్తారు.అలాంటి వ్యక్తి కుమారుడు వంగవీటి రాధా కృష్ణ ను మరోసారి వైసిపి లో చేర్చుకోవడానికి ఎంపీ మిదున్ రెడ్డి ఆయనతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో రాధా కృష్ణ టీడీపీ జనసేన ఉమ్మడి అబ్యర్ధిగానే నిలబడతాడని గతంలో వార్తలు వచ్చిన ఇప్పుడు ఆయన మరోసారి పునరాలోచిస్తునట్లు ? సమాచారం. ఏది ఏమైనా వైసీపీ తో ఇటు ముద్రగడ, అటు వంగవీటి రాధాకృష్ణలు కాయా ? పండో? సంక్రాంతి పండుగకు ముందే ప్రకటన వస్తుందని భావించవచ్చు. పైకి ఎవరు ఎన్ని చెప్పిన గెలుపే కదా! పార్టీల రాజకీయ లక్ష్యం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *