సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 7న పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో పర్యటన ఖరారు అయ్యింది. అలాగే ఎన్నికలలో నిలబడే అభ్యర్థులను ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే జిల్లా లో ఉన్న 7 అసెంబ్లీ సీట్లకు 3 జనసేన కు( భీమవరం, నరసాపురం, తాడేపల్లి గూడెం ) కేటాయించగా మిగిలిన మరో 4 సీట్లలో టీడీపీ పోటీ చెయ్యడానికి సిద్దమౌతున్నట్లు సమాచారం.. ఉండి నుండి టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే, మంతెన రామరాజు, పాలకొల్లు ఎమ్మెల్యే, నిమ్మల రామానాయుడు మరోసారి టీడీపీ అభ్యర్థులుగా బరిలో దిగుతుంటే తణుకు నుండి మాజీ ఎమ్మెల్యే, ఆరిమిల్లి రాధాకృష్ణ మరియు ఆచంట నుండి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మరోసారి టీడీపీ అభ్యర్థులుగా పార్టీ అధిష్టానం ఖరారు చేసిందని .. ఇక ప్రచార బరిలో దిగటమే తరువాయి అని తెలుస్తుంది. అయితే అధికారికముగా చంద్రబాబు సంక్రాంతి పండుగ తరువాత అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. అలాగే జనసేన టీడీపీ ఉమ్మడి పార్టీల ఎంపీ అభ్యర్థిగా రఘురామా కృష్ణంరాజు ను ప్రకటిస్తారా?
